పల్లవి:
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు "ముద్దుగారే"
చరణం:
అంతనెంత గోల్లేతల అరచేత మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము .. "అంతనేంత"
కాంతుల మూడు లోకాల గరుడపచ్చ పోస... 2
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు .. 2 "ముద్దుగారే"
చరణం:
రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము .. "రతికేళి"
సతమై శంకచక్రాల సందుల వైడూర్యము .. 2
గతియై మమ్ముగాచే కమలాక్షుడు .... 2 "ముద్దుగారే"
చరణం:
కాళింగుని తలలపైన కప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము ... "కాళింగుని"
పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము... 2
బాలుని వలె తిరిగి పద్మనాభుడు ... 2 "ముద్దుగారే"

0 comments:
Post a Comment