Tuesday, February 28, 2012

Madhura madhuratara meenakshi_Arjun

పల్లవి:
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి 
మహిని మహిమగల మీనాక్షి కాశిలో విశాలాక్షి..... 2
జాజిమల్లెల ఘుమఘుమల ఝావలి..... 2
లేత సిగ్గుల సరిగమల జాబిలీ.... 
అమ్మ మీనాక్షి ఇది నీ మీనక్షి..... 
వరముల చిలక స్వరముల చిలక కరమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా...          "మధుర"

చరణం:
శృంగారం వాగైనది ఆ వాగే వైగైనది ముడిపెట్టే ఏరైనది విడిపోతే నీరైనది
భారత నాట్య సంభరిత నర్తనే కూచిపూడిలో తకధిమిత 
విశ్వనాథ ఈ ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కథ
మనసే మదురై కొలువైన తల్లి మా మీనాక్షి
ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి         "వరముల"

చరణం:
అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది..
సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది... 
మధురనేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రాసికతతో
కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీర ఘన చరితలలో.. 
తెలుగు తమిళం జతకట్టేనేన్నడో మీనాక్షి
మనసు మనసు ఒకటైన జంటకీ నీ సాక్షి       "వరముల"          "మధుర"