Tuesday, April 22, 2014

Nanu nene marachina_Premadesam

ప్రేమా... ప్రేమా... ప్రేమా... ప్రేమా...
పల్లవి:
నను నేనే మరచినా నీ తోడూ విరహాన వేగుతూ ఈనాడూ
వినిపించదా ప్రియా నా గొడు.. ప్రేమా.... 
నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోనే అది చేరిందే 
నేనున్న సంగతే మరచిందే.. ప్రేమా.. ప్రేమా.. 
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి 
రావా..  నా వాకిట్లో..  నీకై..  నే వేచానే ....                                  "నను నేనే"

చరణం:
ఆకాశ దీపాన్నై నే వేచి ఉన్నా .. నీ పిలిపుకోసం చిన్నారి .. 
నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలెవా సుకుమారీ 
నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువు లేక లోకంలో జీవించలేనే 
నీ ఊహతోనే బ్రతికున్నా...                                                      "నను నేనే"

చరణం:
నిముషాలు శూలాలై వెంటాడుతున్నా వొడిచేర్చుకోవా వయ్యారి 
విరహాల ఉప్పెనలో నే చిక్కున్నా ఓదార్చి పోవా ఓసారి 
ప్రేమించ లేకున్నా ప్రియమార ప్రేమా ప్రేమించినానంటూ బ్రతికించలేవా 
అది నాకు చాలే చెలీ ....                                                          "నను నేనే"

Monday, April 21, 2014

Priya ninu choodaleka_Premalekha

పల్లవి:
ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాక 
నీ తలపు తోనే .. నే బతుకుతున్నా ... 2                                       "ప్రియా"

చరణం:
వీచేటి గాలులనే నేనడిగానూ నీ కుశలం 
ఉదయించే సూర్యుడినే నేనడిగానూ నీ కుశలం 
అనుక్షణం న మనసు తహతహలాడే 
ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే 
అనుదినం కలలలో నీ కథలే 
కనులకు నిదురలె కరువాయె..                                                    "ప్రియా"

చరణం:
కోవెలలో కోరితిని నీదరికే చేర్చమని 
దేవుడినే వేడితిని తలపులలో నిను చూపమని 
లేఖతో ముద్దైన అందించరాదా 
నిను గాక లేఖలనే పెదవంటుకోదా 
వలపులు నీ దరి చేరుటెలా 
ఊహల పడవలే చెర్చునులె..                                                     "ప్రియా "

Om namaha_Geetanjali

పల్లవి:
ఓం నమః నయన శృతులకు .. ఓం నమః హృదయలయలకు ఓం..  
ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం... 
నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు కలిసే వెళలో.. ఓ .. 
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే వేళలో ... 

చరణం:
రేగిన కోరికలతో గాలులు వీచగా 
జీవన వేణువులతో మోహన పాడగా 
దూరము లేనిదై లోకము తోచగా 
కాలము లేనిదై గగనము అందగా 
సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని కరిగే వేళా .. 
ముద్దుల సద్దుకే నిదుర లేచే ప్రణయ గీతిక ఓం .. 

చరణం:
ఒంటరి బాటసారి జంటకు చేరగా 
కంటికి పాపవైతే రెప్పగ మారనా 
తూరుపు నీవుగా వేకువ నేనుగా 
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా 
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే 
జగతికే అతిథులై జననమొందిన ప్రేమ జంటకు                         "ఓం నమః"

Paatala pallakivai_Nuvvostavani

పల్లవి:
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి .. కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి 
నీ తోడు లేనిదే శ్వాసకు శ్వాస ఆడదే 
నువ్వే చేరుకోనిదే గుండెకు సందడుండదే 
నీకోసమే అన్వేషణ నీ రూపురేఖలేవో ఎవరినడగాలి..                     "పాటల"

చరణం:
నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది 
తన రూపు తానెపుడు చూపించలేనంది 
అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి 
ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి 
రెప్పల వెనుక ప్రతి స్వప్నం కళలొలికిస్తుంది 
రెప్పలు తెరిచే మెలకువలో కల నిదురిస్తుంది 
ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి..                                             "పాటల"

చరణం:
పాదాల్ని నడిపించే ప్రణాల రూపేది 
ఊహల్ని కదిలించే భావాల ఉనికేది 
వెన్నెల దారమా జాబిల్లిని చూపుమా 
కోయిల గానమా నీ గూటిని చూపుమా 
ఏ నిమిషంలో నీ రాగం నా మది తాకింది 
తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది 
ఆ రాగమెపుడు నాకు ఎదురు పదుతున్ది..                                    "పాటల"

Eenade edo ayyindi_Prema

పల్లవి:
ఈనాడే ఏదో అయ్యింది .. ఏనాడూ నాలో జరగంది
ఈ అనుభవం మరలా రానిది ...
ఆనంద రాగం మోగింది .. అందాల లోకం రమ్మన్ది..                        "ఈనాడే"

చరణం:
నింగి నెల ఏకం కాగా ఈ క్షణమీలాగే ఆగింది .. 2

ఒకటే మాటన్నది .. ఒకటై పొమ్మన్నది .. 
మనసే ఇమ్మన్నది .. అది నా సొమ్మన్నది.. 
పరువాలు మీటి .. న న న న న  .. సెలయేటి తోటి...న న న న న.. 
పడాలి నేడు .. న న న న న.. కావాలి తోడు .. 
న న న న నన న న న న..                                                       "ఈనాడే"

చరణం:
సూర్యుని మాపి చంద్రుని ఆపి వెన్నెల రోజంతా కాచింది .. 2
పగలూ రేయన్నది .. అసలే లేదన్నది .. 
కలలే వద్దన్నది .. నిజమే కమ్మన్నది .. 
ఎదలోని ఆశే..  న న న న న.. ఎదగాలి బాసై .. న న న న న.. 
కలవాలి నీవు .. న న న న న..  కరగాలి నెను.. 
న న న న నన న న న న....                                                     "ఈనాడే"

Sunday, April 20, 2014

Swapnavenuvedo_Ravoi Chandamama

పల్లవి:
స్వప్నవేణువేదో సంగీతమాలపించే.. 
సుప్రభాతవేళ శుభమస్తు గాలి వీచే .. 
జోడైన రెండు గుండెల ఏకతాళమొ..
జొరైనా యవ్వనాలలో ప్రేమగీతమో..
లేలేతా పూలబసలూ .. కాలేవా చేతిరాతలు                     "స్వప్నవేనువేదో"

చరణం:
నీవే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం... 
ప్రేమ నేను రేయి పగలు హారాలల్లె మల్లెలు నీకోసం... 
కోటి చుక్కలు అష్టదిక్కులు నిన్ను చూచు వేళా... 
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నెరానా... 
కాలాలే ఆగిపోయినా... గాలాలే మూగబోవునా...              "స్వప్నవేనువేదో"

చరణం:
నాలో మోహం రేగే దాహం దచేదేపుడో పిలిచే కన్నుల్లో 
ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో 
మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం 
వారేవా ప్రేమపావురం వాలేదా ప్రణయ గోపురం                "స్వప్నవేనువేదో"

Neelakandara deva deena bandhava raava_Bhukailash

ఆలాపన:
జయ జయ మహాదేవా... శంభో సదాశివా... 
ఆశ్రిత మందారా శృతిశికర సంచారా.... 
పల్లవి:
నీలకందర దేవా దీనబంధవా రారా మమ్ముగావరా... 2
సత్యసుందరా స్వామీ నిత్యనిర్మల పాహీ ... 2                          "నీలకందరా"

చరణం:
అన్యదైవమూ కొలువా... అ.. అ..  
అన్యదైవమూ కొలువా...  నీదు పాదమూ విడువా ... "అన్య"
దర్శనమ్మునీరా మంగళాంగా గంగాధరా .. 2                            "నీలకందర"

చరణం:
దెహియన వరములిడు దానగుణసీమా ... 
పాహియన్నను ముక్తినిడు పరంధామా.. 
నీమమున నీ దివ్య నామసంస్మరణా ... 
ఏమరక చేయుదువు భావతాపహరణ ... 
నీదయామయ దృష్టి దురితముల్లారా .. 
వరసుధావృష్టి నా వాంఛ నీవెరా.. 
కరుణించు పరమేశ ధరహాసబాసా ... 
హరహహర మహాదేవ కైలాస వాసా ...కైలాస వాసా.. 
ఫాలలోచన నాదు మొరవిని దారిని పూనవాయా .. 
నాగభూషణ నన్ను కావగ జాగును చెయకయా.. "ఫాలలోచన"
శంకరా శివశంకరా అభయంకరా.. శంకరా శివశంకరా అభయంకరా.. 
శంకరా శివశంకరా అభయంకరా.. .................... 

Saturday, April 19, 2014

Podagantimayya mimmu purushothama_Annamacharya Keerthanalu

పల్లవి:
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమ 
మమ్ము నెడఎకవయ్య కోనేటి రాయడ                           "పొడగంటిమయ్య"

చరణం:
కోరి మమ్మునేలినట్టి కులదైవమా చాలా 
నేరించి  పెద్దలిచ్చిన నిధానమా 
గారవించి దప్పిదీర్చే కాల మేఘమా మాకు 
చేరువచిత్తములోని శ్రీనివాసుడా...                              "పొడగంటిమయ్య"

చరణం:
భావింపగైవసమైన పారిజాతమా మమ్ము 
చేవదేర గాచినట్టి చింతామణి 
కావించి కోరికలిచ్చే కామధేనువా మమ్ము... 
తావై రక్షించేటి ధరణిధర....                                        "పొడగంటిమయ్య"

చరణం:
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా 
రోగాలడచి రక్షించి దివ్యైషధమా 
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము 
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా                              "పొడగంటిమయ్య"

Anni manthramulu inde aavahinchenu_Annamacharya Keerthanalu

పల్లవి:
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ...2
వెన్నతో నాకు గలిగే వేంకటేశు మంత్రము ... 2            "అన్ని మంత్రములు" 

చరణం:
నారదుడు జపియించె నారాయణ మంత్రము ... 
చేరే ప్రహ్లాదుడు శ్రీ నారసింహ మంత్రము ..... "నారదుడు"
కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము .. 2
వేరే నాకు గలిగే వేంకటేశు మంత్రము ..... 2            "అన్ని మంత్రములు"

చరణం:
రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపియించె 
అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు .... 2
ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించే 
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము             "అన్ని మంత్రములు"

చరణం:
ఇన్ని మంత్రములకెల్లా ఇందిరా నాథుడే గురి 
పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము ...."ఇన్ని"
నన్నుగావగలిగెబో నాకు గురుడియ్యగాను ... 2
వెన్నెల వంటిది శ్రీ వేంకటేశు మంత్రము .... 2          "అన్ని మంత్రములు"