Wednesday, June 13, 2012

Shodasa kalanidhiki_Annamacharya Keerthanalu

పల్లవి:
షోడశకళానిధికి షోడశోపచారములు 
జాడతోడ నిచ్చెలును సమర్పయామి .. 2
                                                                                   "షోడశ"

చరణం:
అలరు విశ్వాత్మకునికి ఆవాహనమిదే 
సర్వ నిలయునికి ఆసనము నెమ్మినిదే  "అలరు"
అల గంగా జనకునికి అర్ఘ్యపాద్యాచమనాలు ... 2
జలధి శాయికిని మజ్జనమిదే                                                "షోడశ"

చరణం:
వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే .. 
సరి శ్రీమంతునకు భూషనములివే .. "వర"
ధరణీధరునకు గంధ పుష్ప ధూపములు .. 2
తిరమిదే కోటి సూర్య తేజునకు దినము ...                                "షోడశ"

చరణం:
అమృత మధనునకు అదివో నైవేద్యము .. 2
గమిజంద్ర నేత్రునకు గప్పురవిడెము ... "అమృత"
అమరిన శ్రీ వేంకటాద్రి మీది దేవునికి .. 2
తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో                                   "షోడశ"

Narayanathe namo namo_Annamacharya Keerthanalu

పల్లవి:
నారాయణతే నమో నమో .. భవ  నారద సన్నుత నమో నమో ... 2

చరణం:
మురహర భవహర ముకుంద మాధవ 
గరుడ గమన పంకజ నాభా 
పరమపురుష భవబంధ విమోచన 
నరమృగ శరీర నమో నమో                                         "నారాయణతే"

చరణం:
జలధి శయన రవిచంద్ర విలోచన 
జలఋహభవనుత చరణయుగ 
బలిబంధన గోపవధూవల్లభ 
నలినోద్ధరతే నమో నమో                                             "నారాయణతే"

చరణం:
ఆదిదేవ సకలాగమ పూజిత 
యాదవకుల మోహన రూప 
వేదోద్దర శ్రీ వేంకటనాయక 
నాదప్రియతే నమో నమొ..                                         "నారాయణతే"

Kondalalo nelakonna koneti_Annamacharya Keerthanalu

పల్లవి:
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు 
కొండలంత వారములు గుప్పెడు వాడు..                            "కొండలలో"

చరణం:
తిమ్మర దాసుదైనను కురువరతినంబి 
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చిన వాడు 
దొమ్ములు జేసినయట్టి తొండమాన్జక్కురవర్తి... 2
రమ్మన్న చోటికి వచ్చి కరుణించే వాడు ....                         "కొండలలో"

చరణం:
అచ్చపు వేడుకతోడ ననంతాళ్ళు వారికి 
ముచ్చిలి వెట్టికి మన్ను మొచ్చిన వాడు 
మచ్చిక దొలచి తిరుమలనంబి తోడుత 
నిచ్చ నిచ్చ మాటలు ఆడి నొచ్చిన వాడు                            "కొండలలో"

చరణం:
కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద 
కరుణించి తన యెడకు రప్పించిన వాడు 
యెంచి ఒక్కడైన వేంకటేశుడు మనలకు 
మంచివాడై కరుణబాలించిన వాడు                                    "కొండలలో"

Tuesday, February 28, 2012

Madhura madhuratara meenakshi_Arjun

పల్లవి:
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి 
మహిని మహిమగల మీనాక్షి కాశిలో విశాలాక్షి..... 2
జాజిమల్లెల ఘుమఘుమల ఝావలి..... 2
లేత సిగ్గుల సరిగమల జాబిలీ.... 
అమ్మ మీనాక్షి ఇది నీ మీనక్షి..... 
వరముల చిలక స్వరముల చిలక కరమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా...          "మధుర"

చరణం:
శృంగారం వాగైనది ఆ వాగే వైగైనది ముడిపెట్టే ఏరైనది విడిపోతే నీరైనది
భారత నాట్య సంభరిత నర్తనే కూచిపూడిలో తకధిమిత 
విశ్వనాథ ఈ ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కథ
మనసే మదురై కొలువైన తల్లి మా మీనాక్షి
ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి         "వరముల"

చరణం:
అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది..
సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది... 
మధురనేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రాసికతతో
కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీర ఘన చరితలలో.. 
తెలుగు తమిళం జతకట్టేనేన్నడో మీనాక్షి
మనసు మనసు ఒకటైన జంటకీ నీ సాక్షి       "వరముల"          "మధుర"