Saturday, May 03, 2014

Nee jathagaa nenundali_Evadu

పల్లవి:
నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి 
నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి 
నాకే తెలియని  నను చూపించి నీకై పుట్టాననిపించి 
నీదాకా నను రప్పించావే 
నీ సంతోషం నాకందించి నా పేరుకు అర్థం మార్చి 
నేనంటే నువ్వనిపించావే ...                                                     "నీ జతగా"

చరణం:
కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లూ చూస్తూ కూర్చున్న రాలేదే.. 
జాడైన లేదే.. 
రెప్పల బైటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా పడుకోవే.. 
పైగా తిడతావే 
లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే వదిలేస్తావ నన్నిలా 
నీ లోకం నాకంటే ఇంకేదో ఉందంటే నమ్మే మాటలా..                   "నీ జతగా"

చరణం:
తెలిసీ  తెలియక వాలిందే నీ నడుమొంపుల్లో నలిగిందే నా చూపూ 
ఏం చేస్తావ్ చెప్పూ .. 
తోచని తొందర పుడుతోంది తెగ తుంటరిగా నను నెడుతోంది నీ వైపు 
నీదే ఆ తప్పు 
నువ్వంటే నువ్వంటూ ఏవేవో అనుకుంటూ విడిగా ఉండలేముగా 
దూరంగా పొమ్మంటు దూరాన్నే తరిమేస్తూ ఒకటవ్వాలిగా..         "నీ జతగా"

Tuesday, April 22, 2014

Nanu nene marachina_Premadesam

ప్రేమా... ప్రేమా... ప్రేమా... ప్రేమా...
పల్లవి:
నను నేనే మరచినా నీ తోడూ విరహాన వేగుతూ ఈనాడూ
వినిపించదా ప్రియా నా గొడు.. ప్రేమా.... 
నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోనే అది చేరిందే 
నేనున్న సంగతే మరచిందే.. ప్రేమా.. ప్రేమా.. 
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి 
రావా..  నా వాకిట్లో..  నీకై..  నే వేచానే ....                                  "నను నేనే"

చరణం:
ఆకాశ దీపాన్నై నే వేచి ఉన్నా .. నీ పిలిపుకోసం చిన్నారి .. 
నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలెవా సుకుమారీ 
నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువు లేక లోకంలో జీవించలేనే 
నీ ఊహతోనే బ్రతికున్నా...                                                      "నను నేనే"

చరణం:
నిముషాలు శూలాలై వెంటాడుతున్నా వొడిచేర్చుకోవా వయ్యారి 
విరహాల ఉప్పెనలో నే చిక్కున్నా ఓదార్చి పోవా ఓసారి 
ప్రేమించ లేకున్నా ప్రియమార ప్రేమా ప్రేమించినానంటూ బ్రతికించలేవా 
అది నాకు చాలే చెలీ ....                                                          "నను నేనే"

Monday, April 21, 2014

Priya ninu choodaleka_Premalekha

పల్లవి:
ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాక 
నీ తలపు తోనే .. నే బతుకుతున్నా ... 2                                       "ప్రియా"

చరణం:
వీచేటి గాలులనే నేనడిగానూ నీ కుశలం 
ఉదయించే సూర్యుడినే నేనడిగానూ నీ కుశలం 
అనుక్షణం న మనసు తహతహలాడే 
ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే 
అనుదినం కలలలో నీ కథలే 
కనులకు నిదురలె కరువాయె..                                                    "ప్రియా"

చరణం:
కోవెలలో కోరితిని నీదరికే చేర్చమని 
దేవుడినే వేడితిని తలపులలో నిను చూపమని 
లేఖతో ముద్దైన అందించరాదా 
నిను గాక లేఖలనే పెదవంటుకోదా 
వలపులు నీ దరి చేరుటెలా 
ఊహల పడవలే చెర్చునులె..                                                     "ప్రియా "

Om namaha_Geetanjali

పల్లవి:
ఓం నమః నయన శృతులకు .. ఓం నమః హృదయలయలకు ఓం..  
ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం... 
నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు కలిసే వెళలో.. ఓ .. 
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే వేళలో ... 

చరణం:
రేగిన కోరికలతో గాలులు వీచగా 
జీవన వేణువులతో మోహన పాడగా 
దూరము లేనిదై లోకము తోచగా 
కాలము లేనిదై గగనము అందగా 
సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని కరిగే వేళా .. 
ముద్దుల సద్దుకే నిదుర లేచే ప్రణయ గీతిక ఓం .. 

చరణం:
ఒంటరి బాటసారి జంటకు చేరగా 
కంటికి పాపవైతే రెప్పగ మారనా 
తూరుపు నీవుగా వేకువ నేనుగా 
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా 
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే 
జగతికే అతిథులై జననమొందిన ప్రేమ జంటకు                         "ఓం నమః"