Sunday, March 17, 2013

Bhavamulona bahyamunandunu_Annamacharya Keerthanalu

పల్లవి:
భావములోనా బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువ ఓ మనసా 
భావములోనా బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువ ఓ మనసా.. 

చరణం:
హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు .. 2
హరి నామములే అన్ని మంత్రములు ... 2
హరి హరి .. హరి హరి .. హరి అనవో మనసా.. 2              "భావములోన"

చరణం:
విష్ణుని మహిమలే విహిత కర్మములు 
విష్ణుని పొగడెడి వేదంబులు ...       "విష్ణుని"
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు ... 2
విష్ణువు..  విష్ణువని వెదకవో మనసా... 2                      "భావములోన"

చరణం:
అచ్యుతుడితడే ఆదియునంతము.. అచ్యుతుడే అసురాంతకుడు .. 2
అచ్యుతుడు శ్రీ వేంకటాద్రిమీదనిదె  ... 2
అచ్యుత..  అచ్యుత శరణనవో మనసా..2                        "భావములోన"

Muddugare yashoda_Annamacharya Keerthanalu

పల్లవి:
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు 
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు                                 "ముద్దుగారే"

చరణం:
అంతనెంత గోల్లేతల అరచేత మాణికము 
పంతమాడే కంసుని పాలి వజ్రము .. "అంతనేంత"
కాంతుల మూడు లోకాల గరుడపచ్చ పోస... 2
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు .. 2                          "ముద్దుగారే"

చరణం:
రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము 
మితి గోవర్ధనపు గోమేధికము .. "రతికేళి"
సతమై శంకచక్రాల సందుల వైడూర్యము .. 2
గతియై మమ్ముగాచే కమలాక్షుడు .... 2                           "ముద్దుగారే"

చరణం:
కాళింగుని తలలపైన కప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము ... "కాళింగుని"
పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము... 2
బాలుని వలె తిరిగి పద్మనాభుడు ... 2                              "ముద్దుగారే"