పల్లవి:
షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చెలును సమర్పయామి .. 2
"షోడశ"
చరణం:
అలరు విశ్వాత్మకునికి ఆవాహనమిదే
సర్వ నిలయునికి ఆసనము నెమ్మినిదే "అలరు"
అల గంగా జనకునికి అర్ఘ్యపాద్యాచమనాలు ... 2
జలధి శాయికిని మజ్జనమిదే "షోడశ"
చరణం:
వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే ..
సరి శ్రీమంతునకు భూషనములివే .. "వర"
ధరణీధరునకు గంధ పుష్ప ధూపములు .. 2
తిరమిదే కోటి సూర్య తేజునకు దినము ... "షోడశ"
చరణం:
అమృత మధనునకు అదివో నైవేద్యము .. 2
గమిజంద్ర నేత్రునకు గప్పురవిడెము ... "అమృత"
అమరిన శ్రీ వేంకటాద్రి మీది దేవునికి .. 2
తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో "షోడశ"