Thursday, March 24, 2011

Anukoledenadu ee lokam naa kosam_Oy!

పల్లవి:
అనుకోలేదేనాడు ఈ  లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని 
ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలో ఊరించే ఎన్నెన్నో వర్నలనే
కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా 
నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా 
అందర్లో ఇన్నాళ్ళూ శిలనై ఉన్నా 
నడి సంద్రంలో ఈనాడే అలనయ్యానా                        "అనుకోలేదేనాడు"

చరణం:
నీలి నింగిలో తేలుతున్న కొంటె వాన విల్లే 
నా నవ్వులో జారిన రంగులేరుకోదా 
నీటి పొంగులో తుళ్ళుతున్న చిట్టి చేప పిల్లే 
నా వేగమే ఇమ్మని నన్ను కోరుకోదా 
రేగే నా ఊహల్ని ఊరేగని .. సాగే ఆ గువ్వల్నే ఓడించగా 
నా కోసం తలవంచే ఆ మేఘమే.. చినుకల్లె నా ముందే వాలిందిగా 
ఒదిగున్న చిన్ని మనసే తొలి నడక నేర్చుకుందా 
ఇక ఉన్న చోటనే ఉంటుందా                                   "అనుకోలేదేనాడు"

చరణం:
నిన్న లేని ఓ స్నేహమేదో నీడ లాగ మారి 
నా తోడుగా చేరగా నన్ను వేడుకోదా 
ఉన్నపాటుగా ఈ ప్రయాణం సాగుతున్న దారి 
ప్రతి మలుపులో వింతలే నాకు చూపుతుందా 
ఈ కలలే తీరేనా ఇన్నాళ్ళకి... సాయంగా మారేనా ఈ స్నేహమే
గుండెల్లో దాగున్నా నా పాటకీ.. రాగాలే నేర్పిందా ఈ బంధమే
ఈ ఆశ జారిపోనీ.. తీరాన్ని చేరుకోని 
నూరేళ్ళ జీవితం నాదవనీ .. 
తా న నే తా నా నా ...... 

0 comments:

Post a Comment