Monday, March 28, 2011

Ennallo vechina udayam_Manchi Mitrulu

పల్లవి:
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే 
ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే 
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి .. 2                      "ఎన్నాళ్ళో"

చరణం:
మంచికి నిలిచే వానిని ఏ వంచన ఏమీ చేయదని .. 2
నీతికి నిలబడు వానికి ఏ నాటికి ఓటమి లేదని .. 2
నే చదివిన జీవితపాఠం నీకే నేర్పాలని వస్తే 
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి .. 2                      "ఎన్నాళ్ళో"

చరణం:
నాగులు తిరిగే కొనలో ఏ న్యాయం పనికి రాదనీ .. 2
కత్తులు విసిరే వానిని ఆ కత్తితోనే గెలవాలని .. 
నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే.. 
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి .. 2                      "ఎన్నాళ్ళో"

0 comments:

Post a Comment