Monday, March 28, 2011

Telusa manasa_Criminal

పల్లవి:
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 
తెలుసా మనసా ఇది ఏజన్మ సంబంధమో 
తరిమిన ఆరుకాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో 
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది                                 "తెలుసా"

చరణం:
ఎన్నడూ వీడిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో తీగసాగె మల్లెగా అల్లుకో 
లోకమే మారిన కాలమే ఆగిన 
మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగా                              "తెలుసా"

చరణం:
ప్రతిక్షణం నా కళ్ళలో నిలిచె నీ రూపం
బ్రతుకులో అడుగడుగున నడిపె నీ స్నేహం 
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పదికాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ                                   "తెలుసా"

1 comments:

Anonymous said...

Good melodius song.. Please change the order of charana's. U've misplace them.

Post a Comment