పల్లవి:
నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి
నాకే తెలియని నను చూపించి నీకై పుట్టాననిపించి
నీదాకా నను రప్పించావే
నీ సంతోషం నాకందించి నా పేరుకు అర్థం మార్చి
నేనంటే నువ్వనిపించావే ... "నీ జతగా"
చరణం:
కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లూ చూస్తూ కూర్చున్న రాలేదే..
జాడైన లేదే..
రెప్పల బైటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా పడుకోవే..
పైగా తిడతావే
లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే వదిలేస్తావ నన్నిలా
నీ లోకం నాకంటే ఇంకేదో ఉందంటే నమ్మే మాటలా.. "నీ జతగా"
చరణం:
తెలిసీ తెలియక వాలిందే నీ నడుమొంపుల్లో నలిగిందే నా చూపూ
ఏం చేస్తావ్ చెప్పూ ..
తోచని తొందర పుడుతోంది తెగ తుంటరిగా నను నెడుతోంది నీ వైపు
నీదే ఆ తప్పు
నువ్వంటే నువ్వంటూ ఏవేవో అనుకుంటూ విడిగా ఉండలేముగా
దూరంగా పొమ్మంటు దూరాన్నే తరిమేస్తూ ఒకటవ్వాలిగా.. "నీ జతగా"