Monday, April 21, 2014

Om namaha_Geetanjali

పల్లవి:
ఓం నమః నయన శృతులకు .. ఓం నమః హృదయలయలకు ఓం..  
ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం... 
నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు కలిసే వెళలో.. ఓ .. 
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే వేళలో ... 

చరణం:
రేగిన కోరికలతో గాలులు వీచగా 
జీవన వేణువులతో మోహన పాడగా 
దూరము లేనిదై లోకము తోచగా 
కాలము లేనిదై గగనము అందగా 
సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని కరిగే వేళా .. 
ముద్దుల సద్దుకే నిదుర లేచే ప్రణయ గీతిక ఓం .. 

చరణం:
ఒంటరి బాటసారి జంటకు చేరగా 
కంటికి పాపవైతే రెప్పగ మారనా 
తూరుపు నీవుగా వేకువ నేనుగా 
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా 
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే 
జగతికే అతిథులై జననమొందిన ప్రేమ జంటకు                         "ఓం నమః"

0 comments:

Post a Comment