Friday, August 26, 2011

Aho oka manasuku nede_Allari Priyudu

పల్లవి:
అహో ఒక మనసుకి నేడే పుట్టిన రోజు 
అహో తన పల్లవి పాడే చల్లని రోజు 
ఇదే.. ఇదే.. కుహూ స్వరాల కానుక 
మరో వసంత గీతిక జనించు రోజు...                                      "అహో"

చరణం:
మాటా పలుకు తెలియనిది మాటున ఉండే మూగ మది 
కమ్మని తలపుల కావ్యమయె కవితలు రాసే మౌనమది ... 
రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది 
శ్రుతిలయలెరుగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది 
ఋతువుల  రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం 
బ్రతుకును పాటగ మలిచేది మనసున కదిలిన మృదునాదం 
కలవని దిక్కుల కలిపేది నింగిని నేలకు  దింపేది 
తనే కదా వారధి క్షణాలకే సారధి మనస్సనేది ...                       "అహో"


చరణం:
చూపులకెన్నడు దొరకనిది రంగూ రూపూ లేని మది 
రెప్పలు తెరవని కన్నులకి స్వప్నాలెన్నో చూపినది 
వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కళ గల నిండు మది 
కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమది 
చేతికి అందని జాబిలిలా కాంతులు పంచె మణిదీపం 
కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం 
అడగని వరములు కురిపించి అమృతవర్షం అనిపించి 
అమూల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది          "అహో"

0 comments:

Post a Comment