పల్లవి:
నారాయణతే నమో నమో .. భవ నారద సన్నుత నమో నమో ... 2చరణం:
మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజ నాభా
పరమపురుష భవబంధ విమోచన
నరమృగ శరీర నమో నమో "నారాయణతే"
చరణం:
జలధి శయన రవిచంద్ర విలోచన
జలఋహభవనుత చరణయుగ
బలిబంధన గోపవధూవల్లభ
నలినోద్ధరతే నమో నమో "నారాయణతే"
చరణం:
ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూప
వేదోద్దర శ్రీ వేంకటనాయక
నాదప్రియతే నమో నమొ.. "నారాయణతే"
0 comments:
Post a Comment