Wednesday, June 13, 2012

Kondalalo nelakonna koneti_Annamacharya Keerthanalu

పల్లవి:
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు 
కొండలంత వారములు గుప్పెడు వాడు..                            "కొండలలో"

చరణం:
తిమ్మర దాసుదైనను కురువరతినంబి 
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చిన వాడు 
దొమ్ములు జేసినయట్టి తొండమాన్జక్కురవర్తి... 2
రమ్మన్న చోటికి వచ్చి కరుణించే వాడు ....                         "కొండలలో"

చరణం:
అచ్చపు వేడుకతోడ ననంతాళ్ళు వారికి 
ముచ్చిలి వెట్టికి మన్ను మొచ్చిన వాడు 
మచ్చిక దొలచి తిరుమలనంబి తోడుత 
నిచ్చ నిచ్చ మాటలు ఆడి నొచ్చిన వాడు                            "కొండలలో"

చరణం:
కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద 
కరుణించి తన యెడకు రప్పించిన వాడు 
యెంచి ఒక్కడైన వేంకటేశుడు మనలకు 
మంచివాడై కరుణబాలించిన వాడు                                    "కొండలలో"

0 comments:

Post a Comment