Saturday, April 19, 2014

Anni manthramulu inde aavahinchenu_Annamacharya Keerthanalu

పల్లవి:
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ...2
వెన్నతో నాకు గలిగే వేంకటేశు మంత్రము ... 2            "అన్ని మంత్రములు" 

చరణం:
నారదుడు జపియించె నారాయణ మంత్రము ... 
చేరే ప్రహ్లాదుడు శ్రీ నారసింహ మంత్రము ..... "నారదుడు"
కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము .. 2
వేరే నాకు గలిగే వేంకటేశు మంత్రము ..... 2            "అన్ని మంత్రములు"

చరణం:
రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపియించె 
అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు .... 2
ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించే 
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము             "అన్ని మంత్రములు"

చరణం:
ఇన్ని మంత్రములకెల్లా ఇందిరా నాథుడే గురి 
పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము ...."ఇన్ని"
నన్నుగావగలిగెబో నాకు గురుడియ్యగాను ... 2
వెన్నెల వంటిది శ్రీ వేంకటేశు మంత్రము .... 2          "అన్ని మంత్రములు"



0 comments:

Post a Comment